కాజల్‌కి మొన్నటి వరకు అనీ మాస్టర్‌తో సమస్య ఉండగా, ఇప్పుడు శ్రీరామ్‌తో నిత్యం ఫైట్ చేస్తూనే ఉంది. సోమవారం ఈ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరగగా, మంగళవారం కూడా ఇది కంటిన్యూ అయింది. నాకు ఇష్టం వచ్చినవాళ్లకి సపోర్ట్ చేస్తా.. స్టార్టింగ్ నుంచి నాతో ఎందుకు గొడవపెట్టుకుంటున్నావ్.. నీకు సపోర్ట్ చేసేవాళ్లు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు.. నేను కూడా నీకు హెల్ప్ చేయాలా? అని శ్రీరామ్..కాజల్‌కి చురకలు అంటించాడు.
త్రిమూర్తులులా ఉన్న సిరి, షణ్ముఖ్, జస్వంత్ నిత్యం వార్తలలో నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు జెస్సీ పోయాక వారిద్దరు మరింత రెచ్చిపోతూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. షణ్ముఖ్-సిరిలు బెడ్లపై కూర్చుని నామినేషన్స్‌పై చర్చించుకున్నారు. రవికి గట్టిగా వేసేశావ్ అని షణ్ముఖ్ అనగా.. సిరి నవ్వుతూ.. ‘నేను పాయింటే మాట్లాడా.. ఎక్కువ తక్కువ మాట్లాడలేదు’ అని అన్నది.
శ్రీరామ్ సోలో గేమ్ ఆడుతున్నా అంటుంటాడు.. మరి రవికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అని షణ్ముఖ్ లాజిక్ లాగాడు. ఆ పాయింట్ మీదే నేను రవిని నామినేట్ చేశా అని చెప్పింది సిరి. ఇంతకీ మన పొజిషన్ ఏంట్రా అని సిరి అడగ్గా.. షణ్ముఖ్ చిరాకు పడుతూ.. ‘లాస్ట్ వీక్ అనవసరంగా తప్పు చేశాను.. వీళ్లకి పొజిషన్ ఇచ్చేశాం’ అని అన్నాడు. ఏం తప్పు అని ఆ తప్పుకు కారణమైన సిరి ఏమి ఎరగనట్టుగా ప్రశ్న వేసింది.