యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా, విస్సా భీమశంకర్ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్‌రాజు క్లాప్ ఇవ్వగా, బాలీవుడ్ నిర్మాత నిహాలాని కెమెరా స్విచాన్ చేశారు. నటుడు శివాజీ గౌరవ దర్శకత్వం వహించారు. హీరో విశ్వక్సేన్ బౌండెడ్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. అతిథులంతా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్వేగభరిత ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతున్నదని, షణ్ముఖ్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడు కాబట్టే తీసుకున్నామని, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు.