బిగ్ బాస్ హౌజ్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ల వలన మంచిగా ఉన్న వాళ్లు కూడా శత్రువులుగా మారుతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ వేడి ఇంకా చల్లారక ముందే మంగళవారం కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడంతో హౌజ్‌మేట్స్ మధ్య గొడవలు జరిగాయి. అయితే సీక్రెట్ నామినేషన్లో తనని ఎనిమిది చేశారని, ఇప్పుడు డైరెక్ట్‌గా ఇద్దరు చేశారంటూ ఇంటి సభ్యులపై అసహానం వ్యక్తం చేశాడు షణ్ముఖ్.
ఇక సిరి, షణ్ముఖ్, జెస్సీ ఓ చోట కూర్చొని నామినేషన్ రచ్చ గురించి ముచ్చటించసాగారు. లోబోని సన్నీ వెనుకేసుకొస్తున్నాడని జశ్వంత్ చెప్పగా.. మన రాజుకు బుర్రలేదని, ఉంటే ఆ టాస్క్ మనమే గెలిచేవామని షణ్ముఖ్ చెప్పాడు. ఇక ఐన్‌స్టీన్ కనిపిఎట్టిన E=mc2 లాజిక్ గురించి అయిన కనుక్కోవచ్చు, కానీ ఈ నామినేషన్ లాజిక్ ఏంటో ఎవరికి అర్ధం కావు అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు.
ఇక నామినేషన్ సమయంలో శ్రీరామ్- కాజల్ మధ్య గొడవ జరగగా, ఆ సమయంలో కాజల్ తనను సిస్టర్ అని పిలవొద్దని శ్రీరామ్‌కు చెప్పింది. ఈ విషయంపై మంగళవారం కూడా ప్రస్తావనకు తీసుకురాగా, బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని కామెడీగానే స్వీకరించి శ్రీరామ్.. అవునవును అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.