బిగ్ బాస్ హౌజ్‌లో కొన్ని బ్యాచ్‌లు ఫాం కాగా, అందులో సిరి-షణ్ముఖ్ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. చాలా క్లోజ్‌గా ఉన్నట్టు కనిపిస్తుంటారు, అంతలోనే గొడవపడుతుంటారు. ఈ ఇద్దరి మధ్య ఏముందో ఎవరికి అర్ధం కావడం లేదు. సిరిని ఒక్కోసారి చూస్తుంటే షణ్ముఖ్‌పై పీకల దాకా కోపం ఉందేమోనన్న అనుమానం కలుగుతూ ఉంటుంది.తాజాగా ఇచ్చిన బీబీ టాస్క్‌లో సిరి డాన్ కూతురు పాత్ర పోషిస్తుంది.
హోటల్‌కి వచ్చిన డాన్ కూతురు ఆ పాత్రలో తెగ జీవించేస్తుంది సిరి. ప్రత్యేకించి షణ్ముఖ్‌తో అన్ని పనులు చేయించుకుంటుంది. బుధవారం ఎపిసోడ్లో షణ్ముఖ్‌ని డ్రింక్ తాగించమని కోరింది. ఆ డ్రింక్ ఆమెపై పడటంతో మొత్తం తుడిపించింది. ఇక గురువారం ఎపిసోడ్లో టిప్ ఇచ్చేందుకు షణ్ముఖ్‌తో తల పట్టించుకుంటూ కనిపించింది. నాతో చాలా సేవలు చేయించుకుంటున్నారు.. మీకు అర్థం కావడం లేదు ఫ్యూచర్ అని పేర్కొన్నాడు షణ్ముఖ్.
టాస్క్ తర్వాత కూడా నువ్వు ఏం పీకలేవు అన్నట్టు మట్లాడింది సిరి. ఇక కాళ్లను వేడి నీళ్లతో క్లీన్ చేయించుకుంది. ఈమెని చూసి కాజల్ కూడా సిద్దమైంది. అనీ మాస్టర్ వేడి నీళ్లు తీసుకొచ్చి కాజల్ కాళ్లపై పోయగా, కయ్యిమంది. ఇక రవి సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాడని గమనించిన అతిథులు డబ్బులు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఎంత కష్టం చేసిన సరిగా డబ్బులు ఇవ్వట్లేదని సర్వీస్ ఆపేశారు.