సన్నీ చేసిన పనులకు చాలా కోపంతో షణ్ముఖ్ ఉండగా, ఆయన దగ్గరకు హమీదా గెటప్‌లో వెళ్లి మనకి ఎవరిమీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ల మీద అరుస్తాది.. అని సెటైర్ వేస్తాడు.. ఆ మాటతో దోసెలు వేస్తున్న షణ్ముఖ్‌కి సర్రున కాలుతుంది.. వెంటనే అక్కడ నుంచి లేచివెళ్లిపోతాడు. ఆ తర్వాత సిరిని మానసికంగా టార్చర్ చేస్తుంటాడు షణ్ముఖ్. ‘నిన్ను ఎందుకు తక్కువ చేస్తా.. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్’ అని సిరి షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి హగ్ కోసం ప్రాధేయపడుతూ.. చేతులు చాపుతుంది.. ఆమె ఫ్రెండ్ షిప్ హగ్‌ని తీసుకోకుండా ఈసారి మాత్రం ఆమెను వెనక్కి నెట్టేస్తాడు షణ్ముఖ్.
సారీ రా బాబూ.. క్షమించు అని చేతులెత్తి దండం పెడుతుంది సిరి.. అయినప్పటికీ .. ‘నువ్ ఎవరికో ఎమోషనల్ కనెక్ట్ అయితే ఆపాను.. నిన్ను వాడెవడో అప్పడం అంటే డిఫెండ్ చేశా.. మీ అమ్మ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడింది. నేను నెగిటివ్ అవ్వట్లేదు.. నేను నెగిటివ్‌గా ఆలోచిస్తున్నానా.. నీ వల్ల నాకు నెగిటివ్ అవ్వలేదా? నీ మంచి కోసం మాట్లాడితే నన్ను నెగిటివ్ అంటావా? నీకు మాత్రం ప్రతిదీ నీకు నచ్చినట్టే అవుతుంది.. అవతల వాడి ఎమోషన్ మాత్రం నీకు గుర్తు ఉండదు.
ఇక్కడ నుంచి వెళ్లిపో.. మిగతా హౌస్ మేట్స్ అందరూ ఎలాగో నువ్వూ అంతే.. నీ కాలుకి దెబ్బ తగిలితే నేను ఆయింట్మెంట్ రాశాను.. దానికి నువ్ ఇస్తున్న రెస్పెక్ట్ ఇదీ.. నేను వందసార్లు ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకోను.. నెగిటివ్‌గా ఆలోచిస్తున్నాడు అని నేను అనను.. నువ్ నాకు అవసరం లేదు.. నువ్ నాతో మాట్లాడొద్దు.. వెళ్లిపో.. నా ఎమోషన్ నీకు ఎప్పుడూ గుర్తుకు రాదు.. నువ్ నాకోసం ఏమీ చేయలేదు.. ప్రతిదానికి నువ్వే కరెక్ట్.. నేను కోపంలో మాట అనేస్తా.. నువ్వే గెలుస్తావ్.. అవతల వాడిని ఆయన ఆయన అంటావ్.. నన్ను అరేయ్ అంటావ్.. వెళ్లు బే అంటావ్.. అంత చనువు ఇచ్చాను నీకు.. మినిమమ్ రిస్పెక్ట్ ఇవ్వవు.. నేను నీ గురించి ఎంతో ఏడుస్తు.. ఎవడైనా గోకుతుంటే ఆపుతా.. అవతల వాడి ముందు నేను తక్కువైనా పర్లేదు అని నేను అనుకుంటా.. మీ మమ్మీకి ఇవన్నీ గుర్తులేవు.. హగ్ ఒక్కటే గుర్తు ఉంది’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు షణ్ముఖ్.