సన్నీపై సీరియస్‌గా ఉన్న షణ్ముఖ్‌ని సిరి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నువ్ డైవర్ట్ కాకు.. ఆ టాస్క్ చేయాలి కదా.. రా చేద్దాం అని అంటుంది సిరి. నేను చేయను.. నా వల్ల కాదని అంటాడు షణ్ముఖ్. సారీ చెప్పాడు కదా.. అతను చేస్తున్నాడని మనం చేయలేం కదా.. ఇది అందరూ కలిసి ఆడాల్సిన గేమ్ కదా అని సిరి అంటే.. నువ్ నన్ను దొబ్బకు.. చిరాకు రప్పించకు.. మీకందరికీ లిమిటేషన్స్ ఉంటాయి.. వాటిని దాటకూడదు.. ఎన్నిసార్లు చెప్పాలి.. మనిషే కదా.. అంటూ సిరిపై సీరియస్ అవుతాడు షణ్ముఖ్.
టాస్క్ చేయనంటే ఎట్లా అవుతుంది.. బిగ్ బాస్ చెప్తాడు చేయాలని అప్పుడు ఏం చేస్తావ్ అని సిరి అనడంతో.. ‘హే చేయను.. నా ఇష్టం బే.. ’ అని అంటాడు షన్నూ. నీ ఇష్టం అంటే కుదరదు.. గేమ్‌లో గొడవ అయితే గేమ్ ఆడటం మానేస్తావా? అని సిరి అనడంతో.. ఎక్స్ ట్రా చేయకు సిరీ.. నీ పని నువ్ చూసుకో అని గట్టిగా గట్టిగా అరుస్తాడు షణ్ముఖ్. ఆ తరువాత మానస్ వచ్చి… షన్నూని గేమ్ ఆడటానికి రమ్మని పిలుస్తాడు. నేను రాను బ్రో అని అంటాడు.
ఏదో ఫ్లోలో అన్నాడులే రా.. ఆర్టిస్ట్‌లకు అలా ఫ్లోలో వచ్చేస్తుంది అని మానస్ అనగా.. నేనూ ఆర్టిస్ట్‌నే.. సన్నీ చేసేదాన్ని జనాలు ఎంజాయ్ చేస్తారు.. దాన్ని నేను కాదనడం లేదు.. బట్ అది నాకు నచ్చదని చెప్తున్నా.. నేనేం చేయలేను’ అంటూ ఇగో ఫీల్ అవుతాడు షణ్ముఖ్. ఆ తరువాత శ్రీరామ్ వచ్చి కన్వెన్స్ చేయడంతో.. బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి చేయడం తప్పదు.. కాసేపు టైం కావాలని అంటాడు షణ్ముఖ్. ఇంతలో సన్నీ.. హమీదా గెటప్ వేసుకుని వచ్చి షన్నూకి ఎదురుగా నిలబడంతో.. షన్నూ సన్నీని అనలేక.. పక్కనే ఉన్న సిరిపై విరుచుకుపడతాడు. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు.. స్పేస్ ఇవ్వాలి.. అని అరుస్తాడు.