బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. శనివారం ఎపిసోడ్లో నాగార్జున రవి బండారాన్ని బయటపెట్డడంతో అంతా షాక్‌లో ఉన్నారు. అయితే ఎపిసోడ్ మొదట్లో ఈ సారి రావణా సాంగ్‌తో ఫైరింగ్ ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత హౌస్‌లో అండర్ స్టాండింగ్ కంటే మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువగా ఉంది. దానిని క్లియర్ చేద్దాం అంటూ ముందుగా శుక్రవారం ఏం జరిగిందో చూపించాడు.
రవి తనను అక్కా అని పిలుస్తున్న క్రమంలోనే తనకు సలహా ఇచ్చానే తప్ప వారంటే తనకు కోపం లేదని ప్రియ.. మానస్ దగ్గర తన బాధను చెప్పుకుంది. ఇక షణ్ముఖ్.. తనను దూరంగా ఉంచడం పట్ల సిరి చాలా ఫీలైంది. రవి, లోబోలు కలిసి ఆడుతున్నారో.. వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు.. ప్రతివారం రవిని లోబో ఎందుకు నామినేట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు.. లోబో నేను వెళిపోతా వెళిపోతా అని అన్నాడు.. అది రవిని ఉద్దేశించి అంటున్నాడేమో అనిపించింది అని షణ్ముఖ్ దగ్గర చెప్పుకొచ్చింది కాజల్.
రవిని నామినేషన్స్‌లో ఎవరైన ఏమైన అంటే లోబో ఊరుకోడు.జెస్సీని లవ్ చేసి ప్రపోజ్ చేయమని లోబోతో చెప్పాడు. అంటే హౌస్‌లో ఉన్నవాళ్లు జోకర్లులాగ కనిపిస్తున్నారా? అతను చాలా తప్పు చేస్తున్నాడు. ఇక్కడకు అందరూ కష్టపడి వచ్చారు.. నీ స్కిట్లు బయట చేసుకో ఇక్కడ కాదు’ అని రవిపై ఫైర్ అయ్యాడు షణ్ముఖ్.