Shankar New Movie | కొత్త ప్రయాణం ప్రారంభం

రామ్‌చరణ్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు శంకర్ నిర్దేశకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్రహీరో చిరంజీవి క్లాప్‌నిచ్చారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ కెమెరా స్విఛాన్ చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. చిరంజీవి స్క్రిప్ట్‌ను దర్శకుడు శంకర్‌కు అందజేశారు. చిత్రబృందం మాట్లాడుతూ ‘కమర్షియల్ హంగులకు సామాజికాంశాల్ని మేళవిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించబోతున్నాం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపింది. ‘కొత్త ప్రయాణం ఆరంభమైంది. ప్రతి ఒక్కరి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా కావాలి’ అని రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రమిది కాగా దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న 50వ సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, జయరామ్,నవీన్‌చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: తిరుణావుక్కరసు, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ, మోనిక, సహనిర్మాత: హర్షిత్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kiara
- ram charan
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

