అగ్ర హీరో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని మెగా ప్రొడక్షన్స్ సంస్థ నవంబర్ 4న రీరిలీజ్ చేస్తున్నది. గురువారం చిత్ర ట్రైలర్ను నాగబాబు, హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
సినిమా చూస్తుంటే నాటి రోజులు గుర్తుకొచ్చాయని, ఎన్ని ఓటీటీ ఛానల్స్ ఉన్నా ఇలాంటి చిత్రాలను థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని నాగబాబు తెలిపారు. ఈ సినిమాలో తాను పోషించిన ఏటీఎం పాత్ర అందరికి గుర్తుండిపోయిందని, ఇప్పటికీ కొందరు అదే పేరుతో పిలుస్తుంటారని శ్రీకాంత్ అన్నారు. ఈ చిత్రాన్ని తాను పశ్చిమ గోదావరి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశానని, ఆ టైంలో మంచి లాభాలను తెచ్చిపెట్టిందని సురేష్ కొండేటి పేర్కొన్నారు.