‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్లిందని చెప్పక తప్పదు.రాను రాను తన నటన మెరుగుపరచుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ రీసెంట్గా దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లూరి సీతరామరాజు పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది.
సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న సినిమాలో చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. .ఇందులో కియారా అద్వాని కథానాయికగా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, రేపు పూజా కార్యక్రామాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు చరణ్ – కియారా అద్వానిపై శంకర్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
చరణ్, కియారా లుక్‌పై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిన శంకర్ టెస్ట్ షూట్‌తో పూర్తి నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది .ఈ ఇద్దరినీ కూడా మరింత కొత్తగా తెరపై చూపించనున్నాడని చెబుతున్నారు. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రలో ఓ బాలీవుడ్ సీనియర్ హీరోయిన నటిస్తోందని టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఆమె ఎవరనేది రానున్న రోజులలో తేలనుంది.