రణబీర్‌కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘షంషేరా’. ఆదిత్యచోప్రా నిర్మించారు. ఈ నెల 22న ప్రేక్షకులముందుకు రానుంది. ప్రతీకార కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రికొడుకులు షంషేరా, బల్లిగా రణబీర్‌కపూర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ‘ఈ చిత్ర కథ కల్పిత నగరమైన కాజాలో జరుగుతుంది. అక్కడ కొంతమంది బానిసలుగా హింసించబడుతుంటారు. అలా బానిసగా ఉన్న వ్యక్తి తిరుగుబాటు ద్వారా నాయకుకుడిగా ఎలా ఎదిగాడన్నదే చిత్ర కథ. స్వేచ్ఛ, గౌరవం కోసం షంషేరా ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సంజయ్‌దత్ నటించారు’ అని చిత్రబృందం పేర్కొంది.