హాస్య నటుడు షకలక శంకర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కార్పొరేటర్’. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి నాయికలు. సంజయ్ పూనూరి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంగా కొనసాగే ఈ కథలో షకలక శంకర్ పాత్ర హైలైట్గా వుంటుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా సమాజానికి మంచి సందేశం వుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎల్.పి.రాజా.