Bloody Daddy Movie | బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో విడుదల కాకపోయిన ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’ వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక బాలీవుడ్లో ఈయనకు విభిన్న సినిమాలను చేసే నటుడుగా మంచి పేరుంది. ఇటీవలే షాహిద్ నటించిన ఫర్జీ వెబ్సరీస్కు తిరుగులేని వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం షాహిద్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో బ్లడీ డాడి సినిమా ఒకటి. అలి అబ్బాస్ జఫార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా న్యూట్ బ్లాంచే అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఒంటి నిండా రక్తపు మరకలతో సీరియస్ లుక్‌లో ఉన్న షాహిద్ పోస్టర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పుతుంది. ఈ సినిమా మొత్తం హీరో నెరేటీవ్లోనే సాగుతుందట. అంతేకాకుండా ఒక్క రాత్రిలోనే సినిమా మొత్తం కథ జరుగుతుందట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక దీనితో పాటు షాహిద్, కృతిసనన్‌తో ఓ రోమ్ కామ్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
Teaser dropping BLOODY soon. @aliabbaszafar @iHimanshuMehra #JyotiDeshpande @SunirKheterpal @gauravbose_TVW @jiostudios @JioCinema @AAZFILMZ @teamoffside #TheVermillionWorld @DianaPenty #SanjayKapoor @RonitBoseRoy @RK1610IsMe
(1/2) pic.twitter.com/hnm8zvqRb8— Shahid Kapoor (@shahidkapoor) April 12, 2023