Chhatrapati Shivaji biopic | మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ రద్దయినట్లు దర్శకుడు అమిత్ రాయ్ ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలను ఆయన వెల్లడించనప్పటికీ, బాలీవుడ్ పరిశ్రమపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ క్రూరమైందని విమర్శించారు. పరిశ్రమలో జరిగిన అనుభవం తనకు ఒక పాఠం నేర్పించిందని, అందుకే తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నానని అమిత్ రాయ్ తెలిపారు.