Shahid Kapoor-Kriti Sanon Movie | ఐదేళ్ల క్రిందట వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. శివ తర్వాత టాలీవుడ్ సినిమాను మలుపు తిప్పిన సినిమాగా అర్జున్ రెడ్డి నిలిచింది. ఇక ఇదే సినిమాను మూడేళ్ల క్రిందట సందీప్, షాహిద్ కపూర్‌తో తెరకెక్కించాడు. అక్కడ కూడా తిరుగులేని విజయం సాధించింది. అప్పటివరకు షాహిద్కున్న క్రేజ్ ఈ సినిమాతో డబుల్ అయింది. సోలోగా వంద కోట్ల మార్క్ దాటని షాహిద్‌ను ఏకంగా మూడొందల కోట్ల క్లబ్లో నిలబెట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో షాహిద్ పారితోషికం కూడా రెట్టింపు అయింది. ఆ తర్వాత మళ్లీ జెర్సీ రీమేక్ చేశాడు. అయితే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందినా.. కమర్శియల్‌గా డిజాస్టర్‌గా మిగిలింది.
ప్రస్తుతం షాహిద్ రెండు సినిమాలను సెట్స్ మీదుంచాడు. అందులో జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ఒకటి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. బైక్‌పై ఒకరిపై ఒకరు కూర్చున్న రొమాంటిక్లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిపై పలువురు నెటీజన్లు కబీర్ సింగ్ పోస్టర్లా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను అమిత్ జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. మాడోక్ ఫిల్మ్స్, జియో స్టూడీయోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
SHAHID KAPOOR – KRITI SANON: FILMING COMPLETE, FIRST LOOK OUT… #JioStudios and #MaddockFilms announce the wrap of the upcoming film, starring #ShahidKapoor and #KritiSanon [not titled yet].
Also features Dharmendra and Dimple Kapadia… Directed by Amit Joshi and Aradhana Sah…… pic.twitter.com/gCKjDxeYtI
— taran adarsh (@taran_adarsh) April 8, 2023