Deva Movie | తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు షాహిద్ కపూర్. రోబోతో ప్రేమలో పడిన యువకుడి పాత్రలో ఈ చిత్రంలో మంచి మార్కులు సంపాదించాడు. అయితే తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవా(Deva Movie). బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేవా సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతుండగా.. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పూజ హెగ్దే, పావేల్ గులాటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో షాహిద్ రూత్‌లెస్ పోలీస్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
SHAHID KAPOOR – POOJA HEGDE: ACTION-THRILLER ‘DEVA’ FIRST LOOK IS HERE… 31 JAN RELEASE… #FirstLook of #ShahidKapoor from #Deva, which arrives in *cinemas* on 31 Jan 2025.
Also features #PoojaHegde and #PavailGulati.
The action-thriller is directed by #RosshanAndrrews, known… pic.twitter.com/NC9PPUBgg3
— taran adarsh (@taran_adarsh) January 1, 2025