Pathaan Movie Teaser | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా వచ్చి నాలుగేళ్ళు దాటింది. ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. షారుఖ్ అభిమానులు ఆయన సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘పఠాన్’ ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. బుధవారం షారుఖ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజైంది.
సీక్రెట్ మిషన్‌లో పట్టుపడిన షారుఖ్‌ను టెర్రరిస్టులు మూడేళ్లు టార్చర్ చేస్తారు. మూడేళ్ళుగా ఆయన గురించి ఎలాంటి కబురు ఉండదు. చివరికి షారుఖ్ చనిపోయుంటాడని ఇండియన్ ఇంటెలిజెన్స్ భావిస్తుంది. అలాంటి సమయంలో పఠాన్ బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. అసలు పఠాన్ మూడేళ్లు ఎక్కడ ఉన్నాడు. టెర్రరిస్ట్‌ల నుండి ఎలా తప్పించుకున్నాడు. టెర్రరిస్ట్‌లను షారుఖ్ ఎలా అంతమొందించాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్ మొత్తం హై యాక్షన్ సీక్వెన్స్‌తో గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. దీపికా, జాన్ అబ్రహం ఫైట్స్ ఆసక్తిని కలగజేస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్ సంస్థలో 50వ సినిమా కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. జాన్ అబ్రహం కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
#PathaanTeaser ని ఇప్పుడే తెలుగులో చూడండి. 25th January, 2023 న మీకు సమీపంలోని బిగ్ స్క్రీన్‌లో #YRF50 తో #Pathaan ని సెలబ్రేట్ చేసుకోండి. హిందీ, తమిళం మరియు తెలుగులో విడుదల అవుతుంది.@deepikapadukone| @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/gP92Y5FRbC
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2022