ఇటీవల ‘పఠాన్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విజయోత్సాహంలో రెండు భారీ చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు షారుఖ్.
‘జవాన్’ షూటింగ్ ఇప్పటికే తుది అంకానికి చేరుకోగా…‘డంకీ’ చిత్రీకరణ కోసం కశ్మీర్ వెళ్లారు షారుఖ్. ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి రూపొందిస్తున్నారు. తాప్సీ నాయికగా నటిస్తున్నది. కశ్మీర్ సోనామార్గ్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ లొకేషన్లను ఎంచుకున్నారు. ఇక్కడ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య రూపకల్పనలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ‘డంకీ’ చిత్రబృందం కశ్మీర్ చేరుకుంది. షారుఖ్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారట.