IMDB top 130 Movies | ఇటీవలే నేషనల్ అవార్డును అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరో అరుదైన ఘనతను తన ఖాతలో వేసుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ సినీ డేటాబేస్ సంస్థ IMDb విడుదల చేసిన కొత్త నివేదికలో ఆయన భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా రికార్డు సాధించాడు. ప్రముఖ అంతర్జాతీయ సినీ డేటాబేస్ సంస్థ IMDb ప్రతి యేడాది తమ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఏ సినిమాపై ఎక్కువ ఆసక్తికనబరిచారు? క్రేజ్ పరంగా ఏ హీరో ఏ స్థానంలో ఉన్నారు? అనే విషయాలపై డేటాను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అందుకు భిన్నంగా గత 25 ఏండ్లలో ప్రేక్షకులను అలరించిన టాప్ 130 సినిమాలను ఒక జాబితగా విడుదల చేసింది. ఇందులో షారుక్ నటించిన సినిమాలే 20 వరకు ఉండడం విశేషం .
గత పాతికేళ్లలో IMDb అత్యంత ప్రజాదరణ పొందిన 130 భారతీయ చిత్రాలలో షారుక్ ఖాన్ నటించిన 20 సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా 2000 నుంచి 2004 వరకు ప్రతి యేడాది షారుఖ్ నటించిన చిత్రాలు ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో నం.1 స్థానంలో నిలిచాయి. షారుక్ ఖాన్ తర్వాత ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ చెరో 11 సినిమాలతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచారు. దీపికా పదుకొణె 10 సినిమాలతో మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు ఈ దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి (Most Viewed Star of the Last Decade) జాబితాలో మాత్రం దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచారు, ఆమె తర్వాత షారుక్ ఖాన్ ఉన్నారు.
ఇక ఐఎమ్‌డీబీ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రతి యేడాది నం.1 స్థానంలో ఉన్న సినిమాలు చూసుకుంటే.
2000 మొహబ్బతే (షారుక్ ఖాన్)
2001 – కభీ ఖుషీ కభీ ఘమ్ (షారుక్ ఖాన్)
2002 – దేవ్‌దాస్ (షారుక్ ఖాన్)
2003 – కల్ హో నా హో (షారుక్ ఖాన్)
2004 – వీర్ జారా (షారుక్ ఖాన్)
2005 – బ్లాక్ (అమితాబ్ బచ్చన్)
2006 – ధూమ్ 2 (హృతిక్ రోషన్)
2007 – తారే జమీన్ పర్ (ఆమిర్ ఖాన్)
2008 – రబ్ నే బనా దీ జోడీ (షారుక్ ఖాన్)
2009 – 3 ఇడియట్స్ (ఆమిర్ ఖాన్)
2010 – మై నేమ్ ఈజ్ ఖాన్ (షారుక్ ఖాన్)
2011 – జిందగీ నా మిలేగీ దొబారా (హృతిక్ రోషన్)
2012 – గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ (మనోజ్ బాజ్‌పేయ్)
|2013 – ది లంచ్‌బాక్స్ (ఇమ్రాన్ ఖాన్)
2014 – పీకే (ఆమిర్ ఖాన్)
2015 – బాహుబలి: ది బిగినింగ్ (ప్రభాస్)
2016 – దంగల్ (ఆమిర్ ఖాన్)
2017 – బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (ప్రభాస్)
2018 – కేజీయఫ్ చాప్టర్ 1 (యష్)
2019 – ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (విక్కీ కౌశల్)
2020 – దిల్ బెచారా (సూశాంత్ సింగ్ రాజ్‌పుత్)
2021 – పుష్ప: ది రైజ్ (పుష్ప 1)(అల్లు అర్జున్)
2022 – కేజీయఫ్ చాప్టర్ 2 (యష్)
2023 – యానిమల్ (సందీప్ రెడ్డి వంగా)
2024 – పుష్ప: ది రూల్ (పుష్ప 2) (అల్లు అర్జున్)
2025 – సైయారా (ఆహాన్ పాండే)\
— IMDb India (@IMDb_in) September 30, 2025