బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు దర్శకుడు సంజయ్‌గుప్తా. షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాలా, షూట్ అవుట్ ఎట్ వడాలా వంటి అండర్‌వరల్డ్ కథాంశాలతో సినిమాలు తీసి హిందీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు సంజయ్‌గుప్తా. ఇటీవలే ఆయన ‘జవాన్’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కెరీర్ తొలినాళ్లలో షారుఖ్‌ఖాన్ ముంబయి మాఫియాకు ఎలా ఎదురు నిలిచారో వివరించారు. ఎవరికీ తలొగ్గని వ్యక్తిత్వమే షారుఖ్‌ఖాన్‌ను బాలీవుడ్లో ఉన్నతంగా నిలబెట్టిందని ఆయన చెప్పారు.
సంజయ్‌గుప్తా మాట్లాడుతూ ‘నిస్సందేహంగా కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్‌ఖానే. 90వ దశకంలో బాలీవుడ్ మొత్తం అండర్‌వరల్డ్ చేతిలో బందీగా ఉండేది. ఎంతటి సూపర్స్టాైర్లెనా వారి ఆదేశాలను పాటించాల్సిందే. అలాంటి సమయంలో షారుఖ్‌ఖాన్ ఒక్కరే అండర్‌వరల్డ్ బెదిరింపులను ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. ‘మీరు నా శరీరంలోకి బుల్లెట్లు దించినా ఫర్వాలేదు. కానీ నేను మాత్రం మీ కోసం ఎప్పటికీ పనిచేయను. ఎందుకంటే నేను పఠాన్‌ను’ అంటూ మాఫియాకు సవాలు విసిరేవాడు షారుఖ్‌ఖాన్. అలాంటి ధీరోదాత్త గుణమే ఆయన్ని బాలీవుడ్ బాద్షాగా మార్చింది’ అని సంజయ్‌గుప్తా పేర్కొన్నారు.