Pathaan | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రస్తుతం పఠాన్ (Pathaan) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 3 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు తమ ఫేవరేట్ స్టార్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమోనని చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో కొనసాగుతుంది. షారుక్‌ఖాన్‌తో పాటు దీపికా పదుకొనే (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham)లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా షారుఖ్ ఖాన్.. పఠాన్ సెట్స్ నుంచి తన 8 ప్యాక్ యాబ్స్కు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. పఠాన్ సినిమా నుంచి షారుఖ్ ఖాన్ ఫస్ట్ లుక్ రావడం ఇదే తొలిసారి. అయితే.. ఇప్పటికే పఠాన్ సెట్స్ నుంచి షారుఖ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అఫిషియల్‌గా షారుఖ్.. ఫోటోను షేర్ చేశాడు.
ఇప్పటికే.. పఠాన్ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన వీడియోను మార్చి 2న షారుఖ్ విడుదల చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఈ సినిమా 25 జనవరి 2023న రిలీజ్ కానుంది. హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదల కానుంది.