Aryan Khan Directorial debut | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Ba***ds of Bollywood). నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో షారుఖ్‌తో పాటు అతడి కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకలో షారుఖ్ మాట్లాడుతూ.. మీరు నాపై చూపించిన ప్రేమలో సగం నా పిల్లలపై కూడా చూపించాలని షారుఖ్ కోరారు.
అభిమానులందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి. నా కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు. అలాగే నా కూతురు సుహానా ఖాన్ నటిగా నటించబోతుంది. మీరు నాపై చూపించే ప్రేమలో సగం వారి మీద కూడా చూపించండి. ఈ సిరీస్‌లో కొన్ని ఎపిసోడ్స్ ఇప్పటికే చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అంటూ షారుఖ్ చెప్పుకోచ్చాడు.