Tiger-3 Movie | బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2019లో వచ్చిన ‘భారత్’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు హిట్టు లేదు. అయితే ఫలితం ఎలా ఉన్నా సల్మాన్‌ఖాన్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘గాడ్‌ఫాదర్’లో కాసేపు మెరిసాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘టైగర్-3’ ఒకటి. టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్లో నటించనున్నాడట. పఠాన్ రిలీజ్ తర్వాత షారుఖ్‌పై షూటింగ్ జరుపనున్నారట. ఇప్పటికే టైగర్‌పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు షారుఖ్ కూడా తోడవడంతో అంచనాలు డబుల్ అయ్యాయి. వీళ్ళద్దరు కలసి విలన్లతో ఫైట్ చేసే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలివనున్నాయట. కాగా ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేశాడు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.