Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు జగపతిబాబు బంఫరాఫర్ కొట్టేశాడు. లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగ్గుభాయ్ వరుసగా సినిమాలతో పాటు టాక్ షోలను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నటుడు తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించాడు. అవును వీరిద్దరూ కలిసి ప్రముఖ శీతల పానియం అయిన థమ్స్ అప్ యాడ్‌లో నటించారు. ఇందులో టాలీవుడ్ నటుడు రాజరవీంద్ర కూడా నటించడం విశేషం. ఇందులో జగ్గుభాయ్, షారుఖ్ ఒకరిపై ఒకరు తుపాకి గురిపెట్టుకొని ఉండగా.. ఇంతలో బిర్యానీ వస్తుంది. బిర్యానీ చూసి టెంప్ట్ అయిన జగపతిబాబు ముందు బిర్యానీ తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తానంటాడు. అయితే షారుఖ్ దీనికి బదులిస్తూ.. బిర్యానీ ఎవరైన ఒక్క చేయితో తింటారా రెండు చేతులతో తినాలి. అంటూ ఒక చేయితో బిర్యానీ మరో చేయితో థమ్స్ అప్ పట్టుకుంటాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
షారుఖ్‌కి జగపతిబాబు నటన అంటే ఇష్టమన్నా విషయం తెలిసిందే. అతడి అంతపురం సినిమా చూసి షారుఖ్ తన నటనను ప్రశంసిస్తూ, తనను ‘బాస్టర్డ్’ అని సంబోధించాడని, అది తనకు దొరికిన గొప్ప కాంప్లిమెంట్ అని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు.
Biryani oka chettho thintunaava?..ch ch ch
Biryani oka chettho kaadhu, rendu chetulatho thinali
Oka chethilo Biryani, inko chethilo… Toofan @iamsrk @ThumsUpOfficial #ToofaniBiryani #ThumsUp pic.twitter.com/JCOIezU0fV— Jaggu Bhai (@IamJagguBhai) August 26, 2025