Shaakuntalam Movie On OTT | సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే వరుస ప్రమోషన్లు, ప్రీమియర్ షోలు గట్రా చేసి సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్లు మిశ్రమ స్పందన వచ్చినా.. దిల్‌రాజు సహా నిర్మాతగా ఉండటంతో కాస్తో కూస్తో పాజిటవ్ బజ్ ఏర్పడింది. అయితే ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ రావడం స్టార్ట్ అయింది. దాంతో మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇక రిలీజ్ తర్వాత కూడా అదే టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది.
ఈ సినిమా రిజల్ట్‌పై ఇటివలే దిల్‌రాజు స్పందించి.. తన ఇరవై ఏళ్ల సినిమా కెరీర్లో శాకుంతలం ఓ జర్క్ ఇచ్చిందని చెప్పాడు. అంతలా శాకుంతలం సినిమా నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు ముహూర్తం కుదిరించుకుంది. ఈ సినిమా హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకుంది. కాగా మే 12నుంచి ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 14న విడుదలైన ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర పోషించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రుద్రమ దేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించాడు.