‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో సంక్రాంతి సీజన్లో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఈ సక్సెస్‌ను ఆస్వాదిస్తూనే ఆయన తన తాజా చిత్రం ‘భోళా శంకర్’ సెట్లో అడుగుపెట్టారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన కోల్‌కతా సెట్లో సోమవారం ప్రారంభమైంది. చెల్లెలు సెంటిమెంట్ ప్రధానంగా కోల్‌కతా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నది. తాజా షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. తమన్నా, రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డడ్లీ, కథా పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: మామిడాల తిరుపతి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహర్ రమేష్.