టీవీ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. నేడు చంద్రహాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్ అనే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ..‘చంద్రహాస్ యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని నమ్ముతున్నాం’ అన్నారు. ‘చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ నా అభిమానుల నటులు. వాళ్లలా పేరు తెచ్చుకోవాలని ఉంది’ అన్నారు హీరో చంద్రహాస్.