September 2023 releases | సినిమాల నిడివి కథను బట్టి రెండు నుంచి రెండున్నర గంటల వరకు ఉండటం సాధారణంగా చూస్తుంటాం. అయితే అంతకుమించిన లెంగ్తీ రన్‌టైం (Lengthy Runtime)తో సినిమాలు మాత్రం ఎప్పుడో కానీ ప్రేక్షకుల ముందుకు రావు. ఎందుకంటే సగటు ప్రేక్షకుడిని లెంగ్తీ రన్ టైం (రెండున్నర గంటలకు మించి) పూర్తయ్యే వరకు సీట్లలో కూర్చోబెట్టాలంటే మాత్రం డైరెక్టర్‌కు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కథ డిమాండ్‌తో సంబందం లేకుండా లెంగ్తీ రన్‌టైం తో సినిమా చేస్తే ప్రేక్షకులకు బోరు కొట్టే అవకాశాలుంటాయి.
కథానుగుణంగా తప్పనిసరి అయితే తప్ప ఈ సాహసం చేయరు. అయితే ఈ సారి మాత్రం ఆ సాహసం చేయడానికి మేము రెడీ అంటూ చాలా మంది దర్శకులు వస్తున్నారు. సెస్టెంబర్లో బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒకటి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తోన్న జవాన్ (Jawan). సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రన్‌టైం ఎంతో తెలుసా..? 2 గంటల 49 నిమిషాలు.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ఖుషి (Kushi). రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ (Vijay deverakonda) , సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. రీసెంట్గా వచ్చిన సెన్సార్ అప్డేట్ ప్రకారం ఖుషి రన్‌టైం 165 నిమిషాలు.. అంటే 2 గంటల 45 నిమిషాలు.
రెండోది ప్రభాస్ నటిస్తోన్న సలార్ ’(Salaar) . ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తోన్న కథనాల ప్రకారం సలార్ 2 గంటల 55 నిమిషాలుండబోతుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే లెంగ్తీ రన్‌టైం సినిమాల లిస్ట్‌లో సలార్ కూడా చేరిపోనుంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కూడా లెంగ్తీ రన్ టైం 179 నిమిషాలు (2గంటల 59 నిమిషాలు). మరి ఈ సారి లెంగ్తీ రన్‌టైంతో ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చొబెడతారా..? అని చూడాలంటున్నారు సినీ జనాలు.
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..
సలార్ టీజర్..
ఖుషి ట్రైలర్..