RT4GM Movie | టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కాంబోలలో రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో ఒకటి. వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్ని బంపర్ హిట్లే. డాన్ శీనుతో మొదలైన వీళ్ల జర్నీ బలుపు, క్రాక్ సినిమాల వరకు వచ్చింది. ఈ మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి బ్లాక్‌బస్టర్ హిట్లయ్యాయి. నిర్మాతల పాలిట కనకవర్షాలు కురిపించాయి. ఇక ఇప్పుడు ఈ కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సారి రవితేజను గోపిచంద్ మరింత మాస్‌గా చూపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన పాత్ర చుట్టే సినిమా కథ తిరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌లోకి ఇప్పుడు సెల్వా రాఘవన్ రావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ధమాకాతో సూపర్ జోడి అనిపించుకున్న శ్రీలీల ఇందులోనూ హీరోయిన్గా చేస్తున్నట్లు తెలుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.
ఇక రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా బరిలో దిగి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా లెంగ్త్ చాలా ఎక్కువుందని రివ్యూలు రావడంతో దాదాపు 25 నిమిషాలు ట్రిమ్ చేసి కొత్త వెర్షన్‌ను ఆదివారం నుంచి ప్రదర్శితం చేస్తున్నారు. అయితే పోటీగా రిలీజైన భగవంత్ కేసరి, లియో సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కాస్త డల్ అయింది.