Nagarjuna | అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
గురువారం అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ సినిమాలోని నాగ్ సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాగార్జున న్యూలుక్‌తో స్టైలిష్‌గా ఎదురుగా ఉన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తూ కనిపిస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల విభిన్న కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
హైబడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లిమిలిటెడ్.