e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home సినిమా ల‌వ్‌స్టోరీలో శేఖర్‌క‌మ్ముల షాకింగ్ యాంగిల్

ల‌వ్‌స్టోరీలో శేఖర్‌క‌మ్ముల షాకింగ్ యాంగిల్

ల‌వ్‌స్టోరీలో శేఖర్‌క‌మ్ముల షాకింగ్ యాంగిల్

నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ల‌వ్‌స్టోరీ. ఇటీవ‌ల కాలంలో ప్రేక్ష‌కుల‌కు ఏదో ఒక కొత్త పాయింట్ ను చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు ద‌ర్శ‌కులు. ఈ మ‌ధ్య విడుద‌లైన‌ ఉప్పెన చిత్రంలో ఓ సన్నివేశాన్ని పెట్ట‌గా..మొద‌ట అంద‌రూ షాక‌యినా..ఆ త‌ర్వాత యాక్సెప్ట్ చేశారు. ఇపుడు ల‌వ్ స్టోరీ చిత్రంలో కూడా శేఖ‌ర్ క‌మ్ముల తెలుగు సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌ని కొత్త ఎలిమెంట్‌ను చూపించ‌బోతున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

యుక్తవయసులో అమ్మాయిలు ఎదుర్కొనే దీర్ఘకాలిక సమస్యను ప్ర‌స్తావిస్తాడ‌ని ఊహాగానాలు వినిపిస్తుండ‌గా..ప్రేక్షకులు దానిపై ఎలా స్పందిస్తారనేది చూడాలి. రోజు వారి జీవితంలో ఎదుర్కొనే స‌మస్యే అయినా మెయిన్ స్ట్రీమ్ మూవీలో ప్ర‌త్యేక స‌మ‌స్యల‌ను చూపించాలంటే చాలా ప‌రిణితితో కూడా ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌రం. మ‌రి శేఖ‌ర్‌క‌మ్ముల ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. సారంగ ద‌రియా పాట‌కు మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ వ‌స్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ల‌వ్‌స్టోరీలో శేఖర్‌క‌మ్ముల షాకింగ్ యాంగిల్
ల‌వ్‌స్టోరీలో శేఖర్‌క‌మ్ముల షాకింగ్ యాంగిల్
ల‌వ్‌స్టోరీలో శేఖర్‌క‌మ్ముల షాకింగ్ యాంగిల్

ట్రెండింగ్‌

Advertisement