ప్రభాస్ (Prabhas), పూజాహెగ్డే (Pooja Hegde) కాంబోలో వస్తున్న ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). యూనివర్సల్ ప్రేమకథతో రాధాకృష్ణకుమార్ (Radha Krishna Kumar) తెరకెక్కించినన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాధేశ్యామ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. బాహుబలిలో కట్టప్పగా అలరించిన సత్యరాజ్ (Satyaraj) రాధేశ్యామ్ తమిళం, హిందీ, కన్నడ,మలయాళ వెర్షన్లలో కీ రోల్లో కనిపిస్తాడు. అయితే తెలుగు వెర్షన్ లో మాత్రం సత్యరాజ్ పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించబోతున్నాడు.
సత్యరాజ్ తన అదృష్ట చిహ్నమని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రభాస్. ఈ ఇద్దరు మిర్చి, బాహుబలి సిరీస్‌లో కలిసి నటించగా..ఈ 3 సినిమాలు బాక్సాపీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే రాధేశ్యామ్ అన్ని భాషల్లో మంచి విజయం సాధిస్తుందని చెబుతున్న ప్రభాస్..తెలుగులో మాత్రం సత్యరాజ్ లేకపోవడంతో…రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలని అంటున్నాడు.
ప్రభాస్, కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్లో నటించారు. ఇందులో బిల్లా మంచి టాక్ తెచ్చుకున్నా..రెబల్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఇపుడు ఓ వైపు సత్యరాజ్, మరోవైపు కృష్ణంరాజు..ప్రభాస్ రాధేశ్యామ్ రేంజ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి.