Satyaprem ki katha Trailer | కరోనాతో కష్టకాలంలో పడిపోయినా బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏడాది క్రితం విడుదలైన ‘భూల్ భూలయ్య-2’ ఊపిరి పోసింది. హార్రర్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వాణీల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఇక ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు ముస్తాబయింది ఈ జంట. వీరిద్దరూ కలిసి తాజాగా ‘సత్య ప్రేమ్ కీ కథ’ సినిమా చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ లు సినిమాపై తిరుగులేని హైప్ తీసుకొచ్చాయి. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. పూర్తి స్థాయి ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కినట్లు స్పష్టమైంది. ఇక మరోసారి కార్తిక్, కియారా జోడీ పర్ ఫెక్ట్ గా కుదిరినట్లు అనిపిస్తుంది. ఇక ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తుంది. దాంతో పాటుగా కార్తిక్ స్టైల్ ఆఫ్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతుందని ట్రైలర్ తో అర్థమైంది. సత్యప్రేమ్ గా కార్తిక్ ఆర్యన్ కనిపించగా.. కథ పాత్రలో కియారా నటించనట్లు తెలుస్తుంది. వీళ్లిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి, మనస్పర్థలు, భావోద్వేగాల సమ్మేళ్లనంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ తో స్పష్టమయింది. నేను వర్జిన్ ని, నా వైఫ్ కోసం శీలాన్ని దాచుకున్నాను. నేను ఈ భూమ్మిదికి నిన్ను ప్రేమించడానికి మాత్రమే వచ్చాను అనే డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. నదియా వాలా గ్రాండ్సన్ ఎంటర్టైనమెంట్స్, నమహా పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.