Krishnamma Title Song | ఫలితంతో సంబంధంలేకుండా కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఓ వైపు హీరోగా రాణిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘కృష్ణమ్మ’ ఒకటి. ఇటీవలే ‘గాడ్సే’తో ప్రేక్షకులను నిరాశపరిచిన సత్యదేవ్ ఈ సారి కృష్ణమ్మతో ఎలాగైనా భారీ విజయం సాధించాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే మొదటి సారి పూర్తి స్థాయి యాక్షన్ కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలై టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. ఇక చిత్ర యూనిట్ తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘కృష్ణమ్మ’ అంటూ సాగే టైటిల్ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఇప్పటికే విడుదలైన ‘ఏమవుతుందో మనలో’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాలభైరవ సంగీతం అందించాడు. సత్యదేవ్‌కు జోడీగా అతిరా రాజీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మించాడు.
కృష్ణమ్మలా ఆహ్లాదంగా సాగిపోయే
గీతం.
అనురాగ్ కులకర్ని గారి స్వరానికి
కాల భైరవ గారి స్వరకల్పనకి
నా కలం నమస్కరిస్తుంది ..🙏🏻🙏🏻#Krishnamma Title Song!
– https://t.co/PzENaO5Z09@kaalabhairava7@anuragkulkarni_@ActorSatyaDev @dirvvgopal @ArunachalaCOffl @saregamasouth pic.twitter.com/XQCRRngQUh— Anantha Sriram (@IananthaSriram) September 4, 2022