సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాయోన్ ’. ఎస్. కిశోర్ దర్శకుడు. అరుణ్ మొళి మాణికం నిర్మిస్తున్నారు. తాన్య రవిచంద్రన్ కథానాయిక.ఈ చిత్ర టీజర్‌ను హీరో రానా దగ్గుబాటి విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ గుడి లోపల ఊహకందని అతీంద్రియ శక్తుల తాలూకు రహస్యాల్ని ఓ యువకుడు తన బృందంతో కలిసి ఎలా ఛేదించాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం. గ్రాఫిక్స్ ప్రధానంగా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాం. హీరోగా శిబి సత్యరాజ్‌కు మంచి పేరుతెచ్చిపెడుతుంది’ అని తెలిపారు. రాధారవి, కె.ఎస్.రవికుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌ప్రసాద్.