Sarpatta parampara-2 | కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తిరుగులేని విజయాలను సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సార్పట్ట పరంపర’. పా.రంజిత్ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్రలో నటించాడు. రెండేళ్ల క్రితం నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రైమ్‌లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన సినిమాగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆర్య నటన, పా.రంజిత్ టేకింగ్ ప్రేక్షకులను మాయ చేసింది. కాగా ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతుంది.
ఈ విషయాన్ని దర్శకుడు పా.రంజిత్ పోస్టర్ రూపంలో అఫిషియల్‌గా ప్రకటన ఇచ్చాడు. ఈ సారి మరింత గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. కాగా ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ఆర్య తెలిపాడు. ఇక ఆర్య ప్రస్తుతం ‘కతర్ బషా ఎంద్ర ముతురమలింగమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే సార్పట్ట సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. పా. రంజిత్ కూడా ప్రస్తుతం విక్రమ్ ‘తంగళన్’ సినిమా చేస్తున్నాడు. 19వ శతాబ్దంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Kabilan returns🥊 For honour and glory🔥#Sarpatta2 Coming soon @arya_offl @officialneelam #TheShowPeople @NaadSstudios #JatinSethi @kabilanchelliah @pro_guna @gobeatroute pic.twitter.com/W7XNVkW6Vj
— pa.ranjith (@beemji) March 6, 2023