Sarkaru Vaari Paata | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీతా గోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి సినిమాపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటుంది. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్తో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈ చిత్రంలోని ‘మ..మ..మహేష’ అంటూ సాగే మాస్‌బీట్ లిరికల్ సాంగ్‌ను మే 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇటీవలే శేఖర్ మాస్టర్ ఈ పాటలో మహేష్ సిగ్నీచర్ స్టెప్స్ అద్భుతంగా ఉంటాయని వెల్లడించాడు. ‘మైండ్ బ్లాక్’ తరహాలో ఈ సాంగ్ కూడ మాస్ స్టెప్స్‌తో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలకు విశేష స్పందన వచ్చింది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కూడా మే 7న పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ సంస్థలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
Get ready with your dancing shoes 😎
Super🌟 @urstrulyMahesh & @KeerthyOfficial are ready with their Mass Moves🕺💃MASSiest Song of the Season #MaMaMahesha on 7th May 💥#SarkaruVaariPaata@ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/lxyDFCxTIP
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 6, 2022