Sarkaar Season 5 | సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న సర్కార్ సీజన్ 5 సక్సెస్ పుల్గా సాగుతుంది. జూన్ 6న మొదలైన ఈ గేమ్ షో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించగా, తొమ్మిదో ఎపిసోడ్ ఆగస్టు 1 (శుక్రవారం) సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది.సుధీర్ ఎనర్జిటిక్ హోస్టింగ్, సెలబ్రిటీల సందడి, ఆట పాటలతో షోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, హర్ష్ రోహన్, కోమలి ప్రసాద్, శ్రీదేవి, వాసంతిక, యాదమ్మ రాజు, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, విజయ్ ఆంటోని, బ్రిగిడా, ప్రియాంక జైన్, సింగర్ సమీరా తదితరులు షోలో పాల్గొని సందడి చేశారు.
తొమ్మిదో ఎపిసోడ్ మరింత స్పెషల్ కాబోతోంది. ఈ ఎపిసోడ్లో మెగా డాటర్ నిహారిక కొణిదెల , నటుడు నవదీప్, యాంకర్ ప్రదీప్, హీరోయిన్ చాందినీ చౌదరి పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి పాటలకు సుధీర్-నిహారికల స్టెప్పులు మెగా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. నవదీప్ హ్యూమర్, ప్రదీప్ పంచులు, చాలా కాలం తర్వాత సుధీర్-ప్రదీప్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఈ ఎపిసోడ్‌కు హైలైట్ గా నిలవబోతున్నాయి. దీంతో, ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆహా ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సీజన్లో ప్రత్యేకంగా సాధారణ ప్రేక్షకులకు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. షో సమయంలో ఆహా డిస్ప్లేలో కనిపించే QR కోడ్ స్కాన్ చేసి, వారు ఇచ్చిన ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సరైన సమాధానాలు పంపితే , స్పోర్ట్స్ బైక్ లాంటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ శుక్రవారం రాత్రి 7 గంటలకు ‘సర్కార్ సీజన్ 5’ మెగా ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి. అద్భుతమైన బహుమతులు పొందండి. కాగా సుడిగాలి సుధీర్ ఇప్పుడు పలు షోలని హోస్ట్ చేస్తూనే మరోవైపు సినిమాలలో అడపాదడపా సందడి చేస్తున్నాడు.