నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఎస్.జె.సూర్య గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో నాని మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ‘యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ఇది. నాని పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మురళీ జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.