Saripodhaa Sanivaaram | టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ శనివారం మువీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అప్డేట్కు సంబంధించి టైమ్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.
”అతడిని చూడాలనుకుంటున్నారా.. శనివారం 11: 59 కి వస్తున్నాడు” అంటూ చిత్రయూనిట్ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య కీల పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Shadows can’t hide the Mass Hysteria inside…
WANNA SEE HIM?
Get ready for an explosion this Saturday at 11:59 AM 💥#SaripodhaaSanivaaram
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies… pic.twitter.com/qdEdAit7vL
— BA Raju’s Team (@baraju_SuperHit) February 21, 2024