Saripodhaa Sanivaaram| గత ఏడాది వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన ఫోకస్ అంతా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వైపు మార్చేశాడు. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘అంటే సుందరానికి’ తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి వచ్చే శనివారం.. స్పెషల్ ట్రీట్ ఎదురుచూస్తోంది సిద్ధంగా ఉండండి. అంటూ మేకర్స్ రాసుకోచ్చారు. దీంతోపాటు ఒక పోస్టర్‌ను కూడా వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వచ్చే శనివారం ఏం అప్డేట్ వస్తుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వచ్చే శనివారం… 🙂
A SPECIAL TREAT AWAITS…. #SaripodhaaSanivaaram #Nani pic.twitter.com/MD2UUrRz4i— Vamsi Kaka (@vamsikaka) February 17, 2024
ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య కీల పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.