తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ (Karthi) పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం సర్దార్ (Sardar). స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు కార్తీ.
బ్లాక్ బస్టర్ పొన్నియన్ సెల్వన్ తర్వాత తక్కువ టైంలోనే మరో సినిమాతో రావడం ఎలా అనిపిస్తోంది..?
పొన్నియన్ సెల్వన్ వేసవికి రావాల్సింది. కానీ ఆలస్యంగా విడుదలైనా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాని తర్వాత ఏదో ఒక కొత్త సబ్జెక్టుతో రావాలనుకున్నా. అదే సర్దార్. తొలిసారి నేను తండ్రీ-కొడుకుగా నటిస్తున్నా. పీఎస్ మిత్రన్ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారు. 1980ల కాలం నాటిది కథ.
తండ్రి పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు..?
మా నాన్న, నాజర్ గారి దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నా. నేను వృద్దుడి పాత్రలో కనిపించేందుకు మేకప్ సాయమైంది. కానీ తండ్రి, పోలీస్ పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించాల్సి వచ్చింది. సర్దార్కు పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఖైదీ సినిమా లాగా..సర్దార్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. స్పై పాత్ర నాకు చాలా సవాలుతో కూడుకున్న పాత్ర.
సర్దార్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుందా..?
సర్దార్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈ దీపావళికి సర్దార్ సినిమా ప్రతీ కుటుంబం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సర్దార్లో లైలా కుమారుడి పాత్ర చాలా ఫన్నీగా సాగుతుంది. చాలా ఇంటెల్లిజెంట్గా ఈ పాత్రను రెడీ చేశారు. సర్దార్ లాంటి స్పై బ్యాక్ డ్రాప్ సినిమా చాలా అరుదుగా వస్తుంది.
సినిమాలో పాన్ ఇండియా అప్పీలుంది..వివిధ భాషల్లో ఎందుకు రిలీజ్ చేయడం లేదు..?
సర్దార్ చిత్రానికి యూనివర్సల్ అప్పీలుంటుంది. చుంకీ పాండే సార్ మొదటి రోజే మాకు ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం హిందీలో కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. సర్దార్‌ను వారం తర్వాత బాలీవుడ్ లో విడుదల చేయాలనుకుంటున్నాం.
డైరెక్టర్ పీఎస్ మిత్రన్ గురించి..?
పీఎస్ మిత్రన్ మంచి మనస్సున్న వ్యక్తి. ఓ దర్శకుడిగా అతను సమాజానికి సాలిడ్ అంశాన్ని తెలియజేయాలనుకోవడం నాకు చాలా నచ్చింది. ప్రతీ ఒక్కరి నుంచి ఐడియా తీసుకునేందుకు రెడీగా ఉంటారు. ఎలాంటి ఈగో ఉండదు. ఓ దర్శకుడిగా ఆయన రీసెర్చ్ వర్క్, శ్రద్ద నాకు చాలా ఇష్టం.