ప్రియదర్శి కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ‘సంచారి..సంచారి’ అంటూ సాగే రెండో గీతాన్ని సోమవారం విడుదల చేశారు. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా, సంజిత్ హెగ్డే ఆలపించారు.
‘సంచారి సంచారి ఎటువైపో నీ దారి, చిరునామా లేని లేఖలా..’ అంటూ కథానాయకుడి మనోవేదనను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘హీరో తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయికి దూరమయ్యే సందర్భంలో ఈ పాట వస్తుంది. కొంత విరహవేదన, అమ్మాయి దక్కదేమోననే బాధ కలబోసిన గీతమిది.
కథాగమనంలో ఈ పాటకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్నారు. రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.