అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈనెల 16న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో మూవీ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగా అలరించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొదటి తెలుగు పాటగా సారంగదరియా నిలిచింది.
సారంగదరియా పాట తాజాగా 200 మిలియన్ వ్యూస్ మార్క్ చేరింది. దీంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మంగ్లీ గాత్రం, సాయిపల్లవి స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.