బ్లాక్బస్టర్ ‘రంగస్థలం’ తర్వాత రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రానున్న సినిమా కావడంతో ‘RC 17’ (వర్కింగ్ టైటిల్)పై షూటింగ్ ప్రారంభానికి ముందే అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్నా, రుక్మిణీవసంత్ల పేర్లు మొన్నటివరకూ బలంగా వినిపించాయి. తాజాగా ఈ జాబితాలోకి ‘దురంధర్’ బ్యూటీ సారా అర్జున్ కూడా చేశారు.
ఈ సినిమాలో కథానాయికగా సారా దాదాపు ఖరారైనదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు వినికిడి. హై ఓల్టేజ్ ైస్టెలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.