Saptha sagaralu Dhaati Movie | ‘777చార్లీ’తో తెలుగులో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకున్నాడు రక్షిత్ శెట్టి. అంతకుముందు ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు కానీ.. అది పెద్దగా ఆడలేదు. దాంతో చాలా మందికి రక్షిత్ పేరు పెద్దగా రిజస్టర్ కాలేదు. ఇక గతేడాది 777చార్లీ మాత్రం రక్షిత్ శెట్టికి తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు అదే నటుడి నుంచి వస్తున్న మరో ఆణిముత్యం సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ. ఈ నెల 1న రిలీజైన ఈ సినిమా కన్నడలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎగబడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత ఓ హార్ట్ హిట్టింగ్ సినిమా చూశామని, గుండెల్ని పిండేసే సినిమా ఇదని వీడియో బైట్లు ఇచ్చేస్తున్నారు.
దాంతో అంతలా సినిమాలో ఏముందా అని తెలుగు ప్రేక్షకులు తీవ్ర ఎగ్జైట్మెంట్కు గురయ్యారు. ఈ క్రమంలో రక్షిత్ శెట్టిని ట్యాగ్ చేస్తూ తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ చేయండంటూ కోరారు. రక్షిత్ సైతం ఆల్రెడీ అదే పనిలో ఉన్నా.. త్వరలో మంచి డేట్‌తో మీ ముందుకు వస్తా అంటూ తెలిపాడు. దాంతో సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజవుతుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సప్త సాగారాలు దాటి అనే టైటిల్‌తో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ హార్ట్ హిట్టింగ్ లవ్‌స్టోరీకి హేమంత్ దర్శకుడు. రక్షిత్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. ఈ సినిమాను రక్షిత్ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించాడు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మను, ప్రియ అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్షిత్ శెట్టి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకి జైలు నుంచి రక్షిత్ బయటకు వచ్చాడా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.