Sapta sagaralu Dhaati Movie | ఎంత హైప్ ఉన్న సినిమా అయినా సరే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేయాలంటే కనీసం రెండు, మూడు రోజులైనా పడుతుంది. అయితే అనూహ్యంగా సప్త సాగారాలు దాటి సినిమా తొలిరోజే తెలుగులో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని స్వయంగా పీపుల్ మీడియా సంస్థే వెల్లడించింది. పాతిక రోజుల కిందట కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కాగా ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడటంతో ఇక్కడ రీసెంట్గా రిలీజ్ చేశారు. సప్త సాగారాలు దాటి అనే టైటిల్‌తో రిలీజ్ చేసిన ఈ సినిమా తొలిరోజే సంచలన వసూళ్లు రాబట్టింది.
తెలుగులోనూ ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ప్రెస్ మీట్లు, ప్రమోషన్లె ఈవెంట్లు గట్రా కాస్త భారీ స్థాయిలోనే ప్లాన్ చేశారు. పైగా పీపుల్ మీడియా బ్యానర్ సమర్పించడంతో ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అయింది. ఇక సినిమా చూసిన ప్రతీ ఒక్కరు హార్డ్ హిట్టింగ్ సినిమా అని, గుండెల్ని పిండేసే సినిమా అని రివ్యూలు ఇచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎగబడిపోతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో షోలను కూడా పెంచారు. ఆంధ్రాలో 10షోలు, తెలంగాణలో 16షోలు పెంచారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రియా అనే గాయని, మను అనే ఓ కారు డ్రైవర్ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. జీవితంలో గొప్పగా బతకాలని కలలు కంటారు. కానీ జీవితం బాగుండటం కోసం వారిద్దరూ తీసుకునే ఓ తప్పుడు నిర్ణయం వారి జీవితాన్నే మార్చేస్తుంది. ఏంటా నిర్ణయం? వారి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగతా కథ.
Keep the love waves coming! 🌊
On Public Demand, we are increasing the shows and adding few theatres across AP & TS
Celebrate your weekend with loved ones in theatres.https://t.co/koiew2JRgA#SaptaSagaraluDhaati 🌊@rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg… pic.twitter.com/kIMtw7m7gC
— People Media Factory (@peoplemediafcy) September 23, 2023