విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఓ సమకాలీన అంశాన్ని చర్చిస్తూ వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ఇంగ్లీష్ రాని ప్రాజెక్ట్ మేనేజర్ విజ్ఞాన్కుమార్గా నటుడు జీవన్ కుమార్ కనిపించనున్నారు. విగ్గు పెట్టుకొని ఆయన పండించే హాస్యం కడుపుబ్బా నవ్విస్తుందని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.