TV Rating| విక్టరీ హీరో వెంకటేష్ చిత్రాలని కుటుంబంతో కలిసి చూడవచ్చు. ఆయన సినిమాలు మినిమం యావరేజ్ అయిన నడుస్తాయి. ఫ్లాప్ అనేది ఉండదు. ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో పలకరించాడు. ఈ సినిమా టాలీవుడ్ లో రీజనల్ హిట్ అయ్యింది. మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా రికార్డు రన్ ని అందుకొని అందరిని ఆశ్చర్యపరచచింది. సినిమాకి తొలి షో నుండి హిట్ టాక్ దక్కడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ టికెట్స్ కోసం క్యూ లైన్లో పడిగాపులు గాసారు. ఇలా వెండితెరపై సెన్సేషనల్ హిట్ అయ్యి 300 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది ఈ చిత్రం. తెలుగులో ఏ సినిమా కూడా అందుకోని మాసివ్ రన్ ఈ సినిమా అందుకోవడం విశేషం.
ఇక థియేటర్ తర్వాత ఈ సినిమా ఓటీటీ, బుల్లితెరకి వచ్చేసింది. సుమారు నెలన్నర పాటు ఆపి అపుడు నేరుగా ఓటిటి సహా స్మాల్ స్క్రీన్ పై కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చేసింది. సినిమా బుల్లి తెరపైనా రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన చాలా రోజుల తర్వాత బుల్లి తెరపై సందడి చేస్తున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే జీ తెలుగు వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ చేయడంతో ఈ సినిమా 18.1 రేటింగ్ సాధించి రికార్డ్ కొట్టింది.కరోనా సమయంలో ఓటీటీలు ఎక్కువ కావడంతో టీఆర్పీ 10 రీచ్ కావడమే చాలా కష్టంగా ఉండేది.
గత ఐదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాధించిన 19.12 టీఆర్పీ నెం.1 గా ఉండగా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 18.1 టీఆర్పీ నమోదు చేసి రెండవ స్థానంలో నిలిచింది. గత రెండేళ్లలో చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మొదటి స్థానం దక్కించుకుంది.మన తెలుగులో ఆల్ టైం హైయెస్ట్ రేటింగ్ కనుక చూస్తే అల వైకుంఠపురములో 29 కి పైగా రేటింగ్ అందుకుంది. అయితే వెండితెరపై సంచలన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ మోస్తరు సంచలనం సృష్టించింది కాని ఆల్ టైం రికార్డుగా నిలవలేకపోయింది . దీంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్లో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు.