Sankranthiki Vasthunam | అగ్ర కథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షూరు చేసిన మేకర్స్.. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు (Godari Gattu) అనే పాటను డిసెంబర్ 03న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ పాట ప్రోమోను వదిలింది. గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ.. గోరింటాకెట్టుకున్న సందమామవే అంటూ రోమాంటిక్‌గా సాగిన ఈ పాటను టాలీవుడ్ సింగర్, సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల, తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ పాడబోతున్నారు. ఇక చాలా రోజుల తర్వాత రమణ గోగుల ఈ పాడుతుండడంతో తన గాత్రానికి డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని తనదైన శైలిలో హుషారుగా ఆలపించాడు రమణ గోగుల. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.